పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా.. జాతకాలను నమ్మను: సత్యరాజ్ కుమార్తె దివ్య

  • తాళి కట్టడం వంటి ఆచారాల వల్లే బంధం బలపడుతుందనే విషయాన్ని తాను నమ్మనన్న దివ్య
  • ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి ఉండేందుకు పెళ్లి అవసరం లేదని వ్యాఖ్య
  • పిల్లలను కనేందుకు పెళ్లి తప్పనిసరి అనే నిబంధనను వ్యతిరేకిస్తున్నానన్న దివ్య

ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కుమార్తె దివ్య సత్యరాజ్ న్యూట్రిషనిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా దివ్య సత్యరాజ్ తన వ్యక్తిగత జీవితం, సామాజిక కట్టుబాట్లపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సంప్రదాయాలకు భిన్నంగా ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలకు వేదికయ్యాయి.


తాళి కట్టడం, ఉంగరాలు మార్చుకోవడం వంటి ఆచారాల వల్లే బంధం బలపడుతుందని తాను నమ్మనని... ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే కలిసి ఉండటానికి పెళ్లి అనే ముద్ర అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. పిల్లలను కనాలంటే పెళ్లి తప్పనిసరి అనే నిబంధనను తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. వివాహం చేసుకోకుండానే తల్లిని కావడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుండబద్దలు కొట్టారు.


తన తండ్రి నాస్తికుడు కావడంతో తనకు జాతకం కూడా రాయించలేదని, గ్రహాలు మన జీవితాన్ని శాసిస్తాయని తాను నమ్మనని స్పష్టం చేశారు. తాను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా తన సంతోషమే తండ్రికి ముఖ్యమని, ఆయన ఇచ్చిన స్వేచ్ఛ పట్ల గర్వంగా ఉందని దివ్య వెల్లడించారు.


Sathyaraj Daughter
Divya
Tolywood
Kollywood

More Telugu News